Saturday, March 3, 2007

అతిపెద్ద టెర్రరిస్ట్ - తస్మాత్!



ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ బాంబులు, తుపాకులు, గ్రేనేడ్లు వాడకుండానే విద్వంసకాండ చేయగల సామర్ధ్యుడు.


మన ప్రమేయం లేకుండా, మన ఇష్టం లేకుండా మనలను భయభ్రాంతులను చేయు చర్యే టెర్రరిజం.

మన ఈ అందమైన లోకంలో మన జీవితాలను ఎంతో అందమైన కలలతొ, కోర్కెలతో అలంకరించు కొని, మన ఊహా జీవితాలను రుంగు రంగుల రంగవల్లలుగా కూర్చుకొని ఎన్నోఆశా భావాలతో, అందదని తెలిసినా అందుకోగలమనే ధిమా, ఆత్మ స్తైర్యం తో, ఆగ మేఘాలను చేదించుకుంటూ ఆ నింగి లోని చందురిడిని, అంగారకుడిని అందుకొని, నిత్య నూతనంగా సాగిపో తున్న ఈ మానవాళిని, మనగడను ఓ పెద్ద భూకంపంలాగా, సునామిలాగా, పిలవని అతిధిలా వచ్చి ఈ మన మంచు పల్లకీలను కరిగించేస్తూ, మనం కూర్చుకున్న బొమ్మరిల్లులను ముక్కలు ముక్కలుగా, రంగవల్లులను చిందర వందర చేసేసి మన కన్న వాళ్ళను, సతీమనులను, మన చిన్నరులునూ, బంధు మిత్ర సమేతులను, కన్నిటి సాగరాన ముంచేస్తూ ఈ మానవ మనుగడను అధాల పాతాలనికి తోక్కెయ్యడమే తన లక్షంగా పెట్టుకొన్నాడు ఈ అతి పెద్ద టెర్రరిస్టు.

వీడిని అంతమొందించలేమని నిర్దారించేసారు ఎంతోమంది మహాను బావులు.
మరి మన మేదస్సులు, ఆత్మ స్తైర్యాలు, అవి ఇవి అన్ని ఏం చేసుకోవడానికి?

పోనీ ఈ విద్వంశాన్ని నివారించవచ్చా? ఆలశ్యం చేయవచ్చా?
ఇక్కడ మనకు కొంత వెలుగు తప్పక ఉన్నది.

ఈ టెర్రరిస్ట్ ను అంతమొందిచలేము గాని మంద గతిని చేయగలము. ఇది ఎలా అనగా - మన ఆహార, పానీయ, వ్యాయయ, నిద్రా, మనో ఉద్రిక్తతా మొదలగు వాటిని మనము సరలించు కొని, నిర్దారించుకొని, పట్టువదలిని విక్రమార్కులలాగ పాటిస్తూ పోవడమే ఈ "అతి పెద్ద టెర్రరిస్ట్ ను" ఎదుర్కోనే ఏకైక మార్గము.

ఈ టెర్రరిస్టును అంతమొందించే మార్గమును 'గుండె శాస్త్రజ్ఞులు' కనుగొనేవరకూ ఇది ఒక్కటే మనకు శరణ్యము.

శరీరో రక్షతి రక్షితః