Sunday, January 28, 2007

ఉత్తమ బ్లాగ్ పోటీలు ప్రారంభమయ్యాయి

ఉత్తమ బ్లాగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కింది లంకెను అనుసరించి మీ, మరియు మీకు నచ్చిన తెలుగు బ్లాగులను ప్రవేశపెట్టండి. చాలా categories ఉన్నాయి. ఆఖరి తారీకు February 5, 2007.
http://www.indibloggies.org/ib-06-nominations-invited
http://www.indibloggies.org/how-to-use-nom-bookmarklet

ఉత్తమ తెలుగు బ్లాగ్ బహుమతిని "తేనెగూడు" sponsor చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ బహుమతి ఏ తేనెగూడుకు దొరుకుతుందో వేచి చూడాలి మరి !!

నాడు -నేడు

బన్నులు -బర్గర్లు
రొట్టెలు - పిజ్జాలు
చికెన్ పకోడీలు - కేఎఫ్ సిలు
సేమియా - పాస్తా
పెరుగన్నం - కర్డ్ రైస్
బొంగరాలు - బెబ్లేడు
చదరంగం - చెస్సు
మైదానంలో క్రికెట్ - కంప్యూ టర్లో క్రికెట్
దొంగా పోలిసు - టెరర్రిస్టు ఎస్టీఎఫ్(STF)
చిల్లర దొంగలు - స్కాంస్టర్లు
చిలకా గోరొంకలు - చిక్స్ అండ్ గయ్స్
పూరిళ్ళు, పెంకుటిళ్ళు - ఫ్లాట్లు, విల్లాలు
దాగుడు మూతలు - దాగుడు లేని మూతులు
ముద్దే ఓ మురిపం - మొద్దు ముద్దులే మురిపం
పెళ్ళిళ పేరయ్యలు - షాది డాట్ కాంలు
పెళ్ళిచూపులు పెళ్ళిళ్ళు - డేటింగులు లివ్ ఇన్లు
ఊటి వెళ్ళితే (ఆహా ఓహో) - స్విజ్జర్లాండ్ వెళ్ళినా (ఇంతేనా)
కొంచం కనిపిస్తే చాలు - కొంచం కనిపీయక పోతేచాలు (సినిమాలలో)

మీరు అతికించండి !!!

ఇలా చేస్తే పోలా!

చిన్న చిన్న రాష్ట్రాలా? (లేక)
చదువు, వృత్తి , తిండి , ఆశ్రయమా??

ప్రజలకు కావలసింది ఏంటి ????

రెండవదే అని నా అభిప్రాయం.
ఇది ప్రజలకు ధన, పదవీ వ్యామోహులైన రాజకీయనాయకుల వలన సంభవమేనా?
ఎన్ని చిన్న రాష్ట్రాలా చేస్తే అంతమంది రాజకీయనాయకులు వారి కుటుంబాలు బాగుపడతాయి.

ప్రజలకు కావలసినది ఎవ్వరిస్తారు?
కల్కి భగవానుడు రావలసిందేనా ?? పగటికలలు ఉష్ కాకి ...

తెలుగునాడు ను 15 కోట్ల రాష్ట్రాలుగా చేస్తేపోలా!
(అందరూ ముఖ్య మంత్రులే - అందరికి పైసలే పైసలు)
పగటికలలు ఉష్ కాకి ...

Sunday, January 21, 2007

వైఎస్సు బాబు ఇలా చేస్తే పోలా !!

KCR వాండు మంత్రి పదవి ఇయ్య లేదని TRS మొదలుపెట్టె.

డిల్లి మంత్రిని చేసిరి మరచిపొయె. ఓన్లీ "లక్ష్మి" వ్రతం.

1.5 సం. తరువాత ఆక్కడ పీకిరి - ఇక్కడ"తెలంగాణ" వ్రతం.

ఇదంతా టైము వేస్టు గాని వైఎస్సు బాబు "ఇలా చేస్తే పోలా"
- KCR ను 'తెలుగునాడు' ముఖ్య మంత్రిని చేస్తే పోలా.
- లక్ష్మీ వ్రత ఫలమును ఇస్తే పోలా

యుగ యుగాలకు మరువని మేలు తెలుగోళ్ళకి చేస్తే పోలా !!

Tuesday, January 16, 2007

నా బొమ్మల సంక్రాంతి

హరిదాసు
గొబ్బెమ్మలు- లంగా వోని
ముత్యాల ముగ్గులు
పద పదవె వయ్యారి గాలి పటమా
డూ డూ బసవన్న, గంగిరెద్దులవాడు
బొమ్మల కొలువు
పొంగలి
ఉత్తరాయన పుణ్యకాలము

సంక్రాతి గురించి పలు చోట్ల ఎన్నో రాసారు. వాటిలో వీలయినన్ని లంకెలను ఒక చోట చేరిస్తే అందరూ చదవడానికి సులువుగా ఉంటుందన్న ఉద్దేశ్యము. ...
http://www.123pongal.com/pongal-in-different-regions/andhrapradesh.html