Tuesday, February 27, 2007

నా లోకం...ప్రేమంటే.....కు నా ద్రుక్పధం

ప్రేమంటే by నా లోకం
నా ద్రుక్పధం: ప్రేమ ఒక వింత చెట్టు.

దీనికి ఉన్న ఒక కొమ్మ ఇంకొక కొమ్మ లాగ ఉండదు. ఒక కొమ్మ అందమైన రొజాపూలనిస్తే, ఇంకొకటి మనస్సును ఆహ్లాదపరిచే మల్లెలను, ఇంకొకటి గన్నేరు పూవును, వేరొకటి మన్మద పూలను, ఇంకొకటి తియ్యటి తేనెనిచ్చే పూలను, మరొక్కటేమో అందమైన పూల కొరకు అంతులేని కొమ్మ చివరకొరకు తీసుకెల్లేటివి..... ఇలా ఇలా ఇంకెన్నో...

ఇలా ఎందుకు లాగానంటే .. ఇక్కడ రకరకాల ప్రేమ కొమ్మలున్నా అన్నిటిలో ఉన్న సద్గుణం..ఇవ్వటమే ..

నా పరిభాషలో ప్రేమంటే ఇవ్వటము..మనస్పూర్వంగా పరిపూర్ణంగా అడగకుండా ఇవ్వడం...

మరి ఇస్తూన్నంతసేపూ తీసుకుంటూ ఉండేదే ఆ ఆఖరి కొమ్మ!! (ఇది కూడ ఒకరకమైన ప్రేమే అని అనేవాళ్ళూ లేకపోరు...)

Monday, February 26, 2007

పిచ్చ బోర్ కొడుతోంది !!

"పిచ్చ బోర్ కొడుతోందిరా"
!
!
!
!
!
ఈ మాట మనం చాలాసార్లు అంటాము, వింటాము. ఈ నవ్య సమాజంలో ఎన్నో వింత పరికరాలు, ఎంటర్ టైన్మెంట్ పరమైన ఎన్నో ఉన్న ఇంకా మనకు వినిపిస్తూనే ఉంది "బోర్". ఆంటే ఇది మానవ చరిత్రలోనే చిరయువా!. ఈ "బోర్" ను దూరము చేసుకొనడన్నికి ఈ జీవిడు ఎన్ని ప్రయత్నాలు చేసినా 6 అడుగులు దూరంలోనే ఉన్నట్టు అనిపించినా "విజయం" 6 అడుగులు దూరంలోనే ఉంతుంది. భగవంతుడే మనతో ఆటలాడనీకి వచ్చినా అతనుకూడా కొంత కాలం తరువాత "బోర్" అనిపిస్తుందేమో ఈ జీవానికి. ఈ భగవన్ లీలా అంతర్యము ఏమిటో? ఈ "బోర్" అంతానికి మార్గమా? తెలుగు బ్లాగింగ్ ఒకరకమైన సమాధానంలా అనిపిస్తోంది. కాలతీర్పు ఏమిటో మరి. వేచి చూడాలి....

Friday, February 23, 2007

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు..ప్చే!

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు...తెలుగు మేధావులంతా ఎక్కడ !!
దొంగ ముత్యం

Sunday, February 18, 2007

దొంగ ముత్యం ?

ఒక ముత్యాల వ్యాపారి దగ్గరికి ఒక మనిషి "9" ముత్యాలను అమ్మడానికి తెచ్చెను. వీటిలో "1" 'దొంగ ముత్యము ' ఉంది. దాని బరువు తక్కువ. మిగతా ముత్యముల బరువు కచ్చితంగా సమానము. నీవు త్రాసులో "బరువు రాయి" వాడ కుండా ఎంత తొందరగా 'దొంగ ముత్యాని ' కనుక్కోగలవు ?? అని సవాలు విసిరాడు.

ఆ వ్యాపారి ఎన్ని తక్కువ తూలికలలో("బరువు రాయి" వాడ కుండా) కనుకున్నాడో చెప్పుకోండి చూదాం ??

Saturday, February 17, 2007

ఒక మనస్సు - మూడు బుర్రలు !!

రెండు చెవులు - ఒక నాలుక
బాగా(ఎక్కువగా) విను - చక్కగ్గా (తక్కువగా) మాట్లాడు

రెండు చేతులు - రెండూ కాళ్ళు
ఈ జీవితములో మంచి చర్యలను సమంగా, జాగ్రత్తగా చేయి -
పయనించాల్సిన జీవిత గమ్యాలను సరైన మార్గములో చేరుకో
మరి
ఒక మనస్సు - మూడు బుర్రలు !!
మనసు మాట మెదడు, మెదడు మాటలు మనసు అంత తొందరగా వినవుగా!!
ఈ దైవ లీలా విశేషము ఏమిటీ?

(నా మాట- ఇవి రెండు సమన్వయనముతో ఉంటే ఈ లోకమే వేరుగా ఉండేదిగా)
మరి మీ మాటలు టప టపా రాయండి.....

Monday, February 12, 2007

Kalyan - Founder member of Thenegoodu passed away

Friends,

I am at loss of words to write about this humble guy Kalyan Raman Janakiraman who passed away Yesterday (Feb 11, 2007) at about 3:30 PM due to massive heart attack in Riyadh. He was just 32 and survived by Wife and a 4 yr daughter.

Kalyan, is my colleague at office (Samba Technology, Samba Financial Group) and we became close over these 9 years and used to share a lot of intellectual space. He was an expert in many platforms and a techie to the core. Apart from all these he was a very humble personality, ever smiling and one of the friendliest characters that one can come across.

He is aTamilian from Chennai and is the founder of the Original Tamil Blogs Portal - ThenKoodu.com which is more than 2 years old and has its own place in Tamil blogosphere. It has more than 2000+ members and 1300+ blogs listed.

He is the key inspiration and the key driving force behind Thenegoodu.com also. It is a great loss to the community here in Riyadh, personally to me as well as to Telugu Web Community.

Just to note that we had plans for Kannada, Malayalam, Bengali blog portals this year. These were his "dreams" and hope they will come true in the blogosphere by someone, sometime in future.

I end this mail here with prayers for his soul to rest at peace and strength to his family.

--Gowri Shankar

Tuesday, February 6, 2007

పండగ వస్తోందే పిల్లా పండగ వస్తోందే...

పండగ వస్తోందే పిల్లా పండగ వస్తోందే... పెద్ద పండుగ వస్తోందే !!

భారతీయులకు అతి పెద్ద పండుగ "క్రికెట్ వరల్డ్ కప్" యే గా మరి. మార్చి 11 నుండి ఏప్రిల్ 28 వరకు ఇంక అఫీసులకు, అన్ని పనులకు ఫొర్లు, సిక్సులే. ఆ ఆకు పచ్చని బయళ్ళని చూస్తోంటే మనస్సు ఎప్పుడా మార్చి 11 అని లబ్-దబ్ లకు బదులు 4-6-4 అంటోంది. మన బల్ల వీరులు బంతులను ఎంత పగలకొడతారో, మన బంతి వీరులు మూడు కర్రలను ఎలా విరగ కొడతారో చూడాల్సిందే మరి. "కమాన్ ఇండియా", "సచిన్ ఆలారే ఆలా", "లగే రహో ద్రావిడ్", "దాదా కి దాదాగిరి ", "దోనీ కీ దులాయి", "హౌజాట్" ధ్వనులు దేశమంతా మారు మ్రోగిపొతాయి.

పండగ వస్తోందే పిల్లా పండగ వస్తోందే...





హైదరాబాదు ఎవడబ్బ సొత్తు ?

హైదరాబాదు ఎవడబ్బ సొత్తు ?

తెలంగాణ వాదుల వాదనలో తెలంగాణా అస్సలు బాగుపడలేదు, ప్రగతి లేదు పేటాకులు లేవు అని పదే పదే వినిపిస్తాయి.

మరి ....హైదరాబాదు ఎక్కడుందబ్బా? రాయలసీమ లోనా, ఆంధ్రాలోన?

తెలుగునాడులో అత్యధికంగా బాగుపడిన ఊరు హైదరాబాదు అన్నదే సత్యం. 50 ఏళ్ళుగా 15 కోట్ల తెలుగు వారందరూ కలసి ప్రగతి తెచ్చింది ఎక్కువగా హైదరాబాదునే కదా అంటే కాదనే తెలుగు వాడుండడు. మరి హైదరాబాదు తెలుగు వారందరి సొత్తు కదా! కాదా!

తెలంగాణా అస్సలు బాగుపడలేదు, చిన్న రాష్ట్రం చేసి ఉద్దరిస్తాం అంటే హైదరాబాదు కాకుండా మిగతా ఊర్లనే అని కదా అర్ధం. ఆంటే తెలంగాణలో హైదరాబాదు లేకున్నా ఓకే అనేగా మరి.

హైదరాబాదు లేకుండా తెలంగాణా ఇస్తే ఓకేనా కేసీఅరూ?
(సమాదానం జగమెరిగిన సత్యం - పైసల్ లేన్ పదవి నా కెందుకు బే!)

దారి లేని గాలిపటం - వేర్పాటువాదం
తెలుగు వారి వృద్దికి దారి తెలుగుదనం తో కూడుకున్న తెలుగునాడు.

Monday, February 5, 2007

తెలుగు ఎడిటర్స్ నుంచి డైరెక్ట్ గా బ్లాగ్ లోకి టపా

ఉపాయము #1: Quillpad - Blogger
1. మీ బ్లాగ్ సెట్టింగ్స్ లో settings-email-mailto-blogger address ను మీరు సెట్ చేసుకోండి.
2. క్విల్పాడులో మీరనుకున్నది రాయండి.
3. Send as email నొక్కండి.
4. కుడి పక్క మీరు step 1 లో పెట్టుకున్న ఈమైల్ ఐడికి పంపించండి. (మీ పేరు, to ఈమైల్ ఐడి తప్పక రాయండీ).

(త్వరలో లేఖినిలో కూడా send email చూడాలని ఉంది. )

ఈ కిందవి నేను సొంతంగా ఇంకా ప్రయత్నించలేదు !!
ఉపాయము #2: విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి
ఉపాయము #3: BarahaIME
ఉపాయము #4: Windows Live Writer