Thursday, September 27, 2007

నాడు - నేడు





















































Friday, August 3, 2007

నా ఇల్లు బంగారం ..నీ ఇల్లు ఇత్తడి ...

నందిగ్రాం ...బంగారం
కమ్మం ..........ఇత్తడి

పిచ్చోళ్ళు...ప్రజలు

http://cities.expressindia.com/fullstory.php?newsid=248334

Saturday, March 3, 2007

అతిపెద్ద టెర్రరిస్ట్ - తస్మాత్!



ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ బాంబులు, తుపాకులు, గ్రేనేడ్లు వాడకుండానే విద్వంసకాండ చేయగల సామర్ధ్యుడు.


మన ప్రమేయం లేకుండా, మన ఇష్టం లేకుండా మనలను భయభ్రాంతులను చేయు చర్యే టెర్రరిజం.

మన ఈ అందమైన లోకంలో మన జీవితాలను ఎంతో అందమైన కలలతొ, కోర్కెలతో అలంకరించు కొని, మన ఊహా జీవితాలను రుంగు రంగుల రంగవల్లలుగా కూర్చుకొని ఎన్నోఆశా భావాలతో, అందదని తెలిసినా అందుకోగలమనే ధిమా, ఆత్మ స్తైర్యం తో, ఆగ మేఘాలను చేదించుకుంటూ ఆ నింగి లోని చందురిడిని, అంగారకుడిని అందుకొని, నిత్య నూతనంగా సాగిపో తున్న ఈ మానవాళిని, మనగడను ఓ పెద్ద భూకంపంలాగా, సునామిలాగా, పిలవని అతిధిలా వచ్చి ఈ మన మంచు పల్లకీలను కరిగించేస్తూ, మనం కూర్చుకున్న బొమ్మరిల్లులను ముక్కలు ముక్కలుగా, రంగవల్లులను చిందర వందర చేసేసి మన కన్న వాళ్ళను, సతీమనులను, మన చిన్నరులునూ, బంధు మిత్ర సమేతులను, కన్నిటి సాగరాన ముంచేస్తూ ఈ మానవ మనుగడను అధాల పాతాలనికి తోక్కెయ్యడమే తన లక్షంగా పెట్టుకొన్నాడు ఈ అతి పెద్ద టెర్రరిస్టు.

వీడిని అంతమొందించలేమని నిర్దారించేసారు ఎంతోమంది మహాను బావులు.
మరి మన మేదస్సులు, ఆత్మ స్తైర్యాలు, అవి ఇవి అన్ని ఏం చేసుకోవడానికి?

పోనీ ఈ విద్వంశాన్ని నివారించవచ్చా? ఆలశ్యం చేయవచ్చా?
ఇక్కడ మనకు కొంత వెలుగు తప్పక ఉన్నది.

ఈ టెర్రరిస్ట్ ను అంతమొందిచలేము గాని మంద గతిని చేయగలము. ఇది ఎలా అనగా - మన ఆహార, పానీయ, వ్యాయయ, నిద్రా, మనో ఉద్రిక్తతా మొదలగు వాటిని మనము సరలించు కొని, నిర్దారించుకొని, పట్టువదలిని విక్రమార్కులలాగ పాటిస్తూ పోవడమే ఈ "అతి పెద్ద టెర్రరిస్ట్ ను" ఎదుర్కోనే ఏకైక మార్గము.

ఈ టెర్రరిస్టును అంతమొందించే మార్గమును 'గుండె శాస్త్రజ్ఞులు' కనుగొనేవరకూ ఇది ఒక్కటే మనకు శరణ్యము.

శరీరో రక్షతి రక్షితః

Tuesday, February 27, 2007

నా లోకం...ప్రేమంటే.....కు నా ద్రుక్పధం

ప్రేమంటే by నా లోకం
నా ద్రుక్పధం: ప్రేమ ఒక వింత చెట్టు.

దీనికి ఉన్న ఒక కొమ్మ ఇంకొక కొమ్మ లాగ ఉండదు. ఒక కొమ్మ అందమైన రొజాపూలనిస్తే, ఇంకొకటి మనస్సును ఆహ్లాదపరిచే మల్లెలను, ఇంకొకటి గన్నేరు పూవును, వేరొకటి మన్మద పూలను, ఇంకొకటి తియ్యటి తేనెనిచ్చే పూలను, మరొక్కటేమో అందమైన పూల కొరకు అంతులేని కొమ్మ చివరకొరకు తీసుకెల్లేటివి..... ఇలా ఇలా ఇంకెన్నో...

ఇలా ఎందుకు లాగానంటే .. ఇక్కడ రకరకాల ప్రేమ కొమ్మలున్నా అన్నిటిలో ఉన్న సద్గుణం..ఇవ్వటమే ..

నా పరిభాషలో ప్రేమంటే ఇవ్వటము..మనస్పూర్వంగా పరిపూర్ణంగా అడగకుండా ఇవ్వడం...

మరి ఇస్తూన్నంతసేపూ తీసుకుంటూ ఉండేదే ఆ ఆఖరి కొమ్మ!! (ఇది కూడ ఒకరకమైన ప్రేమే అని అనేవాళ్ళూ లేకపోరు...)

Monday, February 26, 2007

పిచ్చ బోర్ కొడుతోంది !!

"పిచ్చ బోర్ కొడుతోందిరా"
!
!
!
!
!
ఈ మాట మనం చాలాసార్లు అంటాము, వింటాము. ఈ నవ్య సమాజంలో ఎన్నో వింత పరికరాలు, ఎంటర్ టైన్మెంట్ పరమైన ఎన్నో ఉన్న ఇంకా మనకు వినిపిస్తూనే ఉంది "బోర్". ఆంటే ఇది మానవ చరిత్రలోనే చిరయువా!. ఈ "బోర్" ను దూరము చేసుకొనడన్నికి ఈ జీవిడు ఎన్ని ప్రయత్నాలు చేసినా 6 అడుగులు దూరంలోనే ఉన్నట్టు అనిపించినా "విజయం" 6 అడుగులు దూరంలోనే ఉంతుంది. భగవంతుడే మనతో ఆటలాడనీకి వచ్చినా అతనుకూడా కొంత కాలం తరువాత "బోర్" అనిపిస్తుందేమో ఈ జీవానికి. ఈ భగవన్ లీలా అంతర్యము ఏమిటో? ఈ "బోర్" అంతానికి మార్గమా? తెలుగు బ్లాగింగ్ ఒకరకమైన సమాధానంలా అనిపిస్తోంది. కాలతీర్పు ఏమిటో మరి. వేచి చూడాలి....

Friday, February 23, 2007

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు..ప్చే!

దొంగ ముత్యం ఇంకా దొరకలేదు...తెలుగు మేధావులంతా ఎక్కడ !!
దొంగ ముత్యం

Sunday, February 18, 2007

దొంగ ముత్యం ?

ఒక ముత్యాల వ్యాపారి దగ్గరికి ఒక మనిషి "9" ముత్యాలను అమ్మడానికి తెచ్చెను. వీటిలో "1" 'దొంగ ముత్యము ' ఉంది. దాని బరువు తక్కువ. మిగతా ముత్యముల బరువు కచ్చితంగా సమానము. నీవు త్రాసులో "బరువు రాయి" వాడ కుండా ఎంత తొందరగా 'దొంగ ముత్యాని ' కనుక్కోగలవు ?? అని సవాలు విసిరాడు.

ఆ వ్యాపారి ఎన్ని తక్కువ తూలికలలో("బరువు రాయి" వాడ కుండా) కనుకున్నాడో చెప్పుకోండి చూదాం ??